‘అర్నబ్’ తుఫాను ప్రభావంతో ఒడిశాలోని గంజాం జిల్లాలో బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిశాయి. బురాతాల్ పంచాయతీలోని కొండపై ఉన్న గ్రామాలకు చెందిన 16 మంది గర్భిణులను పాత్రపురం ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వీరిలో అన్సుప గ్రామానికి చెందిన గర్భిణి మంగళవారం ఆరోగ్య కేంద్రంలో మగ బిడ్డకు జన్మనిచ్చింది. తుఫాను వేళ బిడ్డ జన్మించడంతో కుటుంబ సభ్యులు ‘అర్నబ్’గా నామకరణం చేశారు. పసికందుకు అదే పేరుతో జనన ధృవీకరణ పత్రం అందజేసినట్లు ఆరోగ్య కేంద్ర వైద్యుడు తెలిపారు.