రాష్ట్రంలో తుఫాన్ ప్రభావం వల్ల 126 కిలోమీటర్ల మేర రోడ్లకు నష్టం వాటిల్లిందని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. రోడ్లపై కూలిన 1,058 చెట్లలో ఇప్పటికే 859 చెట్లను అధికారులు తొలగించారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 111 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో 14.5 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసమైనట్లు అధికారులు గుర్తించారు. ఈ దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు మొత్తం 59.45 కోట్ల రూపాయలు అవసరమని ప్రభుత్వం అంచనా వేసింది.