ఢిల్లీలో నవంబర్ 1న నిర్వహించ తలపెట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ శ్రేణులకు ప్రత్యేక రైలు కేటాయించకపోవడంపై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ రైల్వే నిలయంలోని జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. కుట్రపూరితంగానే తమకు రైలు సౌకర్యాన్ని నిరాకరిస్తోందని ఆరోపిస్తూ నాయకులు మోదీ సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.