అర్నబ్ తుఫాన్ ప్రభావంతో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో కుండపోత వర్షం నమోదైంది. అనకాపల్లి జిల్లా కన్నూరుపాలెంలో అత్యధికంగా 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విశాఖపట్నంలో 24 సెంటీమీటర్లు, చీమలపల్లి, తాడి, పరవాడ, అచ్యుతాపురం ప్రాంతాల్లో 23 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సింహాచలంలో 22 సెంటీమీటర్లు, దేశపాత్రునిపాలెంలో 21 సెంటీమీటర్లు, బుచ్చయ్యపేట, కోడూరు, పద్మనాభం, గంధవరం ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.