ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో అర్నబ్ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నట్లు సమాచారం. అనంతగిరి మండలంలో ఈదురుగాలులు, వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో వంతెనలు దెబ్బతిన్నాయి. దీంతో స్థానికంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొత్తూరు పంచాయతీ పరిధిలో శివలింగపురం–కృష్ణాపురం మధ్య ఉన్న వంతెనపై నుంచి వరద నీరు పొంగిపొర్లడంతో వంతెన వరద తాకిడికి కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. మండలంలోని కాశీపట్నం వద్ద గోస్తని నది తుపాను ప్రభావంతో ఉద్ధృతంగా ప్రవహిస్తున్నట్లు సమాచారం.