రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 9,829 ఎంపీటీసీ స్థానాల్లో 1,976 స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. మిగిలిన స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఆయా ప్రాంతాల్లో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్యపై స్పష్టత ఏర్పడింది. పలు ప్రాంతాల్లో కూటమి పార్టీలకు చెందిన రెబల్ అభ్యర్థులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు సమాచారం. దీంతో కొన్ని చోట్ల పోటీ లేకుండానే అభ్యర్థులు ఎన్నికయ్యారు.