ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం చేస్తున్నది కుట్ర, దౌర్జన్యం అంటూ విమర్శించారు వైసీపీ అభ్యర్ధులు నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారుల కళ్ల ముందే లాక్కోవడం, చింపేసి టీడీపీ ఏకగ్రీవం అంటూ ప్రచారం చేసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లాలో వైసీపీ అభ్యర్ధులు, శ్రేణులపై చేయి వేస్తే తనపై వేసినట్లేనన్న జగన్.. తమకు టైమ్ వచ్చినప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తామని కూటమి పాలకులను హెచ్చరించారు. మీ వెనుక తాను ఉన్నానని మర్చిపోవద్దని పార్టీ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.