బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుపాను తెలంగాణలో మంగళవారం నుంచి ప్రభావం చూపే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. గురువారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో
కొన్నిచోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.