స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అయిందని ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. పాలన కొనసాగిస్తున్న కూటమి పార్టీలు తమ అధికార మందంతో ఎన్నికల నియమావళికి విరుద్దంగా ఏకగ్రీవాలు చేయిస్తున్నాయని విమర్శించారు. ఇవి స్వచ్చందంగా జరుగుతున్న ఏకగ్రీవాలు కావని ..అధికారాన్ని అడ్డుపెట్టుకొని కూటమి పార్టీలు చేస్తున్న బలాత్కారాలు అంటూ మండిపడ్డారు వైఎస్ షర్మిల. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కూటమి కమిషన్‌గా మార్చేసి పోలీసు వ్యవస్థను బానిసగా చేసి అధికార పార్టీలు చేస్తున్న నిర్వాకమని ఫైర్ అయ్యారు.