ప్రముఖ గేయ రచయిత జావేద్ అక్తర్ నటి రష్మిక మందన్న విషయంలో తన వ్యాఖ్యను సరిదిద్దుకుంటూ క్షమాపణలు తెలిపారు. రష్మిక హిందీ ఉచ్చారణపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలను తప్పుబడుతూ ఆమెకు మద్దతుగా నిలిచిన ఆయన.. ఈ క్రమంలో రష్మికను తమిళ నటిగా పేర్కొన్నారు. అయితే ఆమె కన్నడ నేపథ్యానికి చెందిన నటి అని నెటిజన్లు గుర్తుచేయడంతో తన పొరపాటును అంగీకరించడంతో క్షమాపణలు తెలిపాడు. హీరోయిన్ రష్మిక హిందీ మాట్లాడేటప్పుడు ఉండే యాసను ఎగతాళి చేయడం సరికాదని జావేద్ అక్తర్ అభిప్రాయపడ్డారు.