ప్రధాని మోడీ దివంగత తండ్రిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై కేసు నమోదైంది. బీజేపీ సభ్యుడు కృష్ణ సింగ్ కల్లు, పాట్నాలోని కొత్వాలి పోలీస్ స్టేషన్లో ఖర్గేపై రాతపూర్వక ఫిర్యాదు చేశారు. దీంతో కొత్వాలి పోలీసులు ఖర్గేపై కేసు నమోదు చేశారు. ఒక సభలో ఖర్గే ప్రసంగిస్తుండగా, ఓ వ్యక్తి మధ్యలో అడ్డుపడుతూ ప్రధాని మోడీ ఎక్కడికీ వెళ్లరు(అధికారం కోల్పోరు) అని నినాదం చేయడంతో ఖర్గే “మోదీ కా బాప్ భీ జాయేగా” అని అన్నారు.