విశాఖపట్నం–ఢిల్లీ నగరాల మధ్య రోజువారీ నాన్‌స్టాప్ విమాన సర్వీసులను 2026 అక్టోబర్ 25 నుంచి ప్రారంభించింది. ఈ సర్వీసులో భాగంగా తొలి విమానం విశాఖపట్నంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఉదయం 9.05 గంటలకు బయలుదేరి, ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉదయం 11.30 గంటలకు చేరుకుంది. ఆకాశ ఎయిర్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ఢిల్లీ నుంచి ఉదయం 5.55 గంటలకు బయలుదేరే QP 1841 విమానం ఉదయం 8.20 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.ఈ రెండు సర్వీసులు ప్రతిరోజూ నడుస్తాయి.