ఉత్తరప్రదేశ్‌కు చెందిన యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అమృత్ సింగ్ డారెన్‌పై కేరళం పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోర్ట్ కొచ్చిలోని కాశీ ఆర్ట్ కేఫ్ లో మహాత్మా గాంధీ చిత్రంతోపాటు జిన్నా చిత్రాన్ని ప్రదర్శించడాన్ని ఆయన ప్రశ్నించారు. అక్కడ గొడ్డు మాంసం వడ్డిస్తున్నారని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వెల్లడించారు. అంతేకాకుండా, ఆ ప్రాంతంలో ముస్లింల ఆధిపత్యం తీవ్రంగా ఉందని, కొన్ని వర్గాల ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పలేకపోతున్నారని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమయ్యాయి.