మాజీ ఐఏఎస్ అధికారి దివ్య మిట్టల్ తన పార్టీతో ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు ప్రకటించి ఆసక్తి రేపారు. 2027 అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులు ఉన్న అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని, మొత్తం 403 నియోజకవర్గాలపై దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. మిర్జాపూర్ జిల్లాలోని చునార్లో శనివారం ప్రజలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో దివ్య మిట్టల్ ఈ ప్రకటన చేశారు. తమ జననీతి భారత్ పార్టీ చునార్ నియోజకవర్గంలోనూ అభ్యర్థిని నిలబెడుతుందని వెల్లడించారు.