గోండు మన్యం వీరుడు, క్రాంతివీరుడు, అమరజీవి కొమురం భీమ్ త్యాగాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో స్మరించుకోవడం గర్వకారణమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. జల్–జంగల్–జమీన్ హక్కుల పరిరక్షణ కోసం, ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం, అస్తిత్వం కోసం కొమురం భీమ్ చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన ఆయన త్యాగం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, కొమురం భీమ్ ఆశయాలను స్మరించుకుంటూ, ఆయన పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.