సౌదీ అరేబియా బలగాలు, యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారుల మధ్య దాడులు తీవ్రరూపం దాల్చాయి. శనివారం సౌదీ అరేబియా వ్యాప్తంగా ఉన్న కీలక చమురు కేంద్రాలు అరామ్కో కేంద్రం, రాబిగ్ రిఫైనరీ, రియాద్‌లోని కింగ్ ఖలీద్, దమ్మామ్‌లోని కింగ్ ఫహద్, నజ్రాన్ అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఖమీస్ ముషైత్ ఎయిర్‌బేస్‌పై దాడులు చేసినట్లు హూతీలు ప్రకటించారు. పవిత్రమైన మక్కా, మదీనా ప్రాంతాల వైపు హూతీలు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించగా, సౌదీ రక్షణ వ్యవస్థలు వాటిని అడ్డుకున్నాయి. కూల్చేసిన క్షిపణుల శకలాలు మక్కాలోని వాడి అల్-ముగమ్స్ ప్రాంతంలో పడ్డాయి.