భారతీయ భౌతిక శాస్త్రవేత్త అశోక్ సేన్‌కు 2026 ఆస్కార్ క్లెయిన్ పతకం లభించింది. ఈ గౌరవం అందుకున్న తొలి భారతీయ భౌతిక శాస్త్రవేత్తగా ఆయన నిలిచారు. బెంగళూరులోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియొరటికల్ సైన్సెస్ (ఐసీటీఎస్)-టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ లో ఐసీటీఎస్-ఇన్ఫోసిస్ ప్రొఫెసర్‌గా అశోక్ సేన్ పనిచేస్తున్నారు. ఆధునిక స్ట్రింగ్ థియరీకి ప్రధాన రూపకర్తల్లో ఒకరిగా ఆయనకు గుర్తింపు ఉంది. పదార్థంలోని ప్రాథమిక భాగాలు బిందు కణాలు కాకుండా, ఒక డైమెన్షన్ కలిగిన చిన్న తీగల వంటి వస్తువులని స్ట్రింగ్ థియరీ పేర్కొంటుంది.