‘ఈముద్ర’ సెక్యూరిటీ కీల్లో బలహీనతలు, ఏఐ టూల్స్ ఆధారిత హ్యాకింగ్ దాడులతో పాటు ఎస్బీఐ వినియోగదారుల డేటా బహిర్గతం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. భారత అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ ఎస్బీఐకి చెందిన 3,897 మంది కస్టమర్ల రికార్డులు బహిర్గతమైనట్లు బ్యాంకు అధికారికంగా ధ్రువీకరించింది. రోజురోజుకూ పెరుగుతున్న ఈ డిజిటల్ దాడుల నేపథ్యంలో ప్రతిఒక్కరూ సాఫ్ట్వేర్లను క్రమం తప్పకుండా అప్డేట్ చేసుకోవాలని, బలమైన పాస్వర్డ్లను వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. మరోపక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఆధారంగా హ్యాకింగ్ దాడులు పెరిగాయి.