మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడి కుమారుడు చైతన్య నామినేషన్ తిరస్కరణకు గురైంది. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం జడ్పీటీసీ స్థానానికి వైకాపా తరపున బొత్స చైతన్య నామినేషన్ దాఖలు చేశారు. చైతన్యకు విజయనగరంలో ఓటు ఉందని ప్రాదేశిక ఎన్నికల రిటర్నింగ్ అధికారికి జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన రిటర్నింగ్ అధికారి నామినేషన్ తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. రిటర్నింగ్ అధికారి నిర్ణయంపై వైకాపా జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్, న్యాయవాదులు.. జిల్లా కలెక్టర్ కు అప్పీల్ చేశారు.