నగరంలో తాగునీటి వృథాపై కఠిన చర్యలు చేపట్టాలని జలమండలి నిర్ణయించింది. నీటి వృథాను నివారించేందుకు ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేశారు. ట్యాంకర్ల ద్వారా నీటి వృథాకు పాల్పడితే నవంబర్ 1 నుంచి సంబంధిత ట్యాంకర్ యజమానికి రూ.5 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అదే ట్యాంకర్ రెండో సారి నిబంధనలు ఉల్లంఘిస్తే రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని స్పష్టం చేశారు. నీటి లీకేజీలు, మూతలు లేని ట్యాంకర్లను ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద ఉపయోగించవద్దని,ట్యాంకర్ల యజమానులు, డ్రైవర్లు బాధ్యతగా వ్యవహరించాలని అధికారులను ఎండీ ఆదేశించారు.