కోట్ల మంది భక్తులు శబరిమలలో ఎంతో భక్తిశ్రద్ధలతో స్వీకరించే ప్రసాదంలో అవినీతి వ్యవహారం కలకలం రేపుతోంది. అయ్యప్ప స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన ‘అరవణ పాయసం’ తయారీ కోసం ఉపయోగించే స్వచ్ఛమైన మిల్మా నెయ్యిని దారి మళ్లించి.. దానికి బదులుగా నాసిరకం, చౌకైన నెయ్యిని సరఫరా చేసిన బాగోతం బయటపడింది. శబరిమల ఆలయానికి సరఫరా కావాల్సిన దాదాపు 11వేల లీటర్ల స్వచ్ఛమైన మిల్మా నెయ్యిని మధ్యలోనే దారి మళ్లించినట్లు తిరువిదాంకూర్ దేవస్వం బోర్డు పేర్కొంది. అధికారులు ఒక రవాణా కాంట్రాక్టర్ను అరెస్ట చేయడం జరిగింది.