జనసేన నేతలను టీడీపీ నాయకులు చావబాదారు. బెల్లంకొండ మండలం గంగిరెడ్డిపాలెం ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చిన శ్రీనివాసరావుపై టీడీపీ నేతలు దాడి చేశారు. జనసేన అభ్యర్థిని నామినేషన్ దాఖలు చేయకుండా అడ్డుకుని దాడి చేశారు. జనసేన అభ్యర్థికి తీవ్ర గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ వెంటనే స్పందించి దాడి చేసిన టీడీపీ నేతలతో జనసేన అభ్యర్థికి క్షమాపణ చెప్పించాలి వాళ్ల కాళ్లు పట్టించాలి. లేకపోతే ధర్నా చేస్తాం’’ అంటూ వెంకటేశ్వరరావు హెచ్చరించారు.