ఇస్రో అంతరిక్ష రంగంలో మరో కీలక ముందడుగు వేయడానికి సిద్ధమైంది. అక్టోబర్ 30న రాత్రి 11:55 గంటలకు శ్రీహరికోటలోని షార్ రెండో ప్రయోగ వేదిక నుంచి GSLV-F18 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగానికి సంబంధించి రాకెట్ మూడు దశల అనుసంధాన ప్రక్రియతో పాటు ఉపగ్రహ అమరిక పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. 2,232 కిలోల బరువు కలిగిన ‘NVS-03’ అనే రెండవ తరం నావిగేషన్ ఉపగ్రహాన్ని భూమికి అత్యంత ఎత్తులో ఉండే జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ (GTO) లోకి ఈ రాకెట్ ప్రవేశపెట్టనుంది.