పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’ నుండి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న బర్త్‌డే స్పెషల్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. బ్రిటీష్ నిఘా వ్యవస్థను దెబ్బతీసిన ఒక వీరుడి సాయం తన వద్ద ఉందని బోస్ చెప్పడం, భగవద్గీత ఆధారంగా బలమైన కోడ్‌ను రూపొందించిన సైనికుడు, స్ట్రాటజిస్ట్ మరియు స్పై గా ప్రభాస్ పాత్రను పరిచయం చేయడం గ్లింప్స్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.