జియో ప్లాట్ఫామ్స్ IPO సబ్స్క్రిప్షన్ ముగిసింది. మూడో రోజు చివరికి నాటికి మొత్తం 22.19 రెట్ల స్పందన అందుకుంది. మొత్తం 19.75 కోట్ల షేర్లకు గానూ 438 కోట్ల బిడ్లు వచ్చాయి. క్యూఐబీ కోటా అత్యధికంగా 70 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యింది. రిటెయిల్ ఇన్వెస్టర్ల కోట 2.72 రెట్లు సబ్స్క్రిప్షన్ అందుకుంది. నాన్ ఇన్స్టిట్యూషనల్ కోటా 14 రెట్లు సబ్స్క్రైబ్ అయ్యింది. ఉద్యోగుల కోటాకు 2.93 రెట్లు స్పందన రాగా.. రిలయన్స్ షేర్హోల్డర్ల కేటగిరీ 7.6 రెట్లు స్పందన పొందింది.