రాష్ట్రంలో నీటి ఎద్దడి, వర్షాభావ పరిస్థితులకు ఎన్నినో ప్రభావమే కారణమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దీన్ని ఓ భూతంగా చూడవద్దని… మనతో పాటు చాలా దేశాలు ఈ కరువును ఎదుర్కొన్నాయని తెలిపారు. 30 లక్షల పంప్సెట్లలో 15 లక్షలు ఎండిపోయాయి. వచ్చే సీజన్లో చుక్క నీరు కూడా దొరకదని.. ప్రాజెక్టుల్లో 20 శాతం నీటి నిల్వలు కూడా లేవన్నారు. 200 టీఎంసీల నీళ్లు కూడా లేవు.. డెడ్ స్టోరేజీకి చేరినట్లు తెలిపారు. తాగునీటికి తప్ప సాగుకు ఏ మాత్రం అవకాశం లేదన్నారు.