ఎల్ నినో దృష్ట్యా తెలంగాణ వ్యాప్తంగా నెలకొన్న కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని పేర్కొంది. గిరిజన ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకంపై దృష్టి సారించాలని సూచించింది. జాబ్ కార్డులు లేని గిరిజన కుటుంబాలకు కొత్త జాబ్ కార్డులు మంజూరు చేయాలని ఆదేశించింది. 125 రోజుల ఉపాధి కల్పనకు చర్యలు చేపట్టాలని పేర్కొంది. జాబ్ కార్డుల్లో 18 ఏళ్ళు నిండిన కుటుంబ సభ్యుల పేర్లు ఉండాలని స్పష్టం చేసింది. భట్టి విక్రమార్క ఎల్-నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై క్యాబినెట్ సబ్-కమిటీ సమావేశమైంది.