పరీక్ష హాల్లో విద్యార్థి వద్ద అనుమతి లేని వస్తువు కనిపిస్తే ఇన్విజిలేటర్ దాన్ని స్వాధీనం చేసుకుని, నిర్దేశిత ఫారంలో ఘటన వివరాలను నమోదు చేస్తారు. అనంతరం విద్యార్థికి కొత్త ఆన్సర్ బుక్లెట్ ఇచ్చి పరీక్షను కొనసాగించే అవకాశం కల్పిస్తారు. విద్యార్థి తప్పు చేశాడా? అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనే నిర్ణయాన్ని పరీక్ష హాల్లోనే తీసుకోకుండా, సంబంధిత విభాగం క్రమశిక్షణ కమిటీ (DDAC) పరిశీలిస్తుంది. ఐఐటీ బాంబే జులై 2026లో ప్రవేశపెట్టిన కఠిన నిబంధనల స్థానంలో ఏప్రిల్ 2015 నాటి విధానాన్ని చేయాలని నిర్ణయించింది.