ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఫౌజీ సినిమా నుంచి విడుదలైన కొత్త పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ తాజా పోస్టర్ పాతకాలం నాటి వింటేజ్ స్టైల్లో చాలా ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంది. అగ్ని కీలల మధ్య ఉన్న బంగారు నాణెంపై ప్రభాస్ సైడ్ ప్రొఫైల్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఫైల్ నెం 25 డిక్లాసిఫై చేస్తున్నాం, ఒంటరిగా పోరాడే బెటాలియన్ అలాగే 1939 నుంచి మోస్ట్ వాంటెడ్ వంటి క్యాప్షన్లు సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి.