ఉగ్రవాదం విషయంలో తాము భారత్ ఆందోళనను అర్థం చేసుకున్నామని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో తెలిపారు. ఉగ్రవాదంపై భారత్ వ్యక్తం చేస్తున్న ఆందోళన తమకూ ఉందని అన్నారు. భారత్‌ను కాదనుకుని పాక్‌కు దగ్గరయ్యే ప్రశ్నే లేదని చెప్పారు. పాక్ సహా అన్ని దేశాలతో సంబంధాలు నెరపాల్సిన అవసరం అమెరికాకు ఉందని మంత్రి రూబియో పేర్కొన్నారు. దాయాది దేశాల దౌత్యంతో ఘర్షణలు తీవ్రరూపం దాల్చకుండా అడ్డుకునే అవకాశం ఉందని చెప్పారు.