ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీనామాపై నిరసనలు జరుగుతున్న సమయంలో రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్లడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరో 30 ఏళ్లపాటు ఆయన పార్టీ అధికారానికి దూరంగా ఉంటుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు. మీరు ఎందుకు విదేశాలకు వెళ్తారో చెప్పరు. సరేలే.. అది మీ వ్యక్తిగతం. కానీ ఒకసారి దిల్లీకి తిరిగివచ్చిన తర్వాత నా మాటలు వినండి.మరో 30 ఏళ్ల వరకు మీరు అధికారంలోకి రారు’’ అని అమిత్ షా వ్యంగ్యాస్త్రాలు విసిరారు.