తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. కొద్ది రోజులుగా యనమల తుని నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. గురువారం ఉదయం నిద్రలేచిన ఆయనకు సుమారు పది గంటల సమయంలో అకస్మాత్తుగా తీవ్రమైన నీరసం ఆవరించినట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు, అక్కడే ఉన్న అనుచర వర్గం ఆయనకు ప్రాథమిక ఉపశమనం కలిగించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పరిస్థితి ఏమాత్రం కుదుటపడకపోవడంతో అంబులెన్స్ లో కాకినాడకు తీసుకువెళ్లారు.