ఏపీలో స్థానిక ఎన్నికల్లో నామినేషన్ల గడువును పొడిగించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. తమను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని ఎక్కడైనా అభ్యర్థుల నుంచి ఇప్పటికే ఫిర్యాదులు వచ్చి ఉంటే వాటిని పరిశీలించి 22వ తేదీ సాయంత్రంలోగా నిర్ణయం తీసుకోవాలని ఎస్ఈసీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పుడు కొత్తగా ఫిర్యాదుచేయడానికి వీల్లేదని, ఇప్పటికే ఉన్న వాటిని మాత్రమే పరిశీలిస్తారన్నారు. అభ్యర్థుల తుది జాబితా ప్రకటన తేదీని ఈనెల 25 వరకు పొడిగించడంతో పాటు, తదుపరి విచారణ 27కు వాయిదా వేసింది.