ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్ టీవీ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్ వివాహం మరియు రిసెప్షన్కు సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. కావ్య మారన్, అనిరుధ్ల వివాహ రిసెప్షన్ వేడుకకు రావాల్సిందిగా కోరుతూ సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ భేటీకి సంబంధించిన చిత్రాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ కార్యక్రమంలో అనిరుధ్ తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు