ఈరోజు అనగా అక్టోబర్ 17 వ తేదీ శనివారం రాత్రి నుంచి రేపటి వరకు ఏపీ వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు దంచి కొట్టబోతున్నాయి. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలతో పాటు కర్నూలు, ప్రకాశం, అనంతపురం, నెల్లూరు, కడప, నంద్యాల, తిరుపతి జిల్లాల పరిధిలో వర్షాల ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉండబోతోంది. దీనికి తోడు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగంతో వీచే రక్కసి ఈదురుగాలులు మరింత భయాందోళనకు గురి చేస్తున్నాయి.