తిరువురు నియోజక వర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలు కుంపట్లు రాజేశాయి. కూటమిలో చైర్మన్ అభ్యర్థి ఎంపిక ముసలం రేపింది. పొత్తులో భాగంగా తిరువూరు మున్సిపల్ చైర్మన్ స్థానం జనసేనకు కేటాయించింది కూటమి ప్రభుత్వం. అయితే, అభ్యర్థి ఎంపిక విషయంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ తిరుగుబాటు ప్రకటించారు. తన తరుపున నాగ శ్రావణీని టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి ప్రకటించారు. రేపు తిరువూరు మున్సిపాల్టీ చైర్మన్ అభ్యర్ధి పెనుబల్లి శ్రావణి నామినేషన్ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు.