దసరా పండుగను పురస్కరించుకుని భాగ్యనగర వాసులు భారీ సంఖ్యలో తమ సొంతూళ్లకు పయనమవడంతో జాతీయ రహదారులపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్-విజయవాడ (NH-65) జాతీయ రహదారిపై శనివారం ఉదయం నుంచి వాహనాలు భారీగా పోటెత్తాయి. ఫలితంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. శనివారం ఉదయానికి రద్దీ మరింత తీవ్రరూపం దాల్చింది. ప్రస్తుతం గంటల కొద్దీ సమయం పడుతోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.