ప్రకాశం జిల్లా దర్శి మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల వేళ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నామినేషన్లు దాఖలు చేసేందుకు అధికార తెలుగుదేశం (TDP), ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అభ్యర్థులు, వారి మద్దతుదారులు ఒకే సమయంలో మున్సిపల్ కార్యాలయానికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితి చేయిదాటకుండా ఉండేందుకు పోలీసులు ఇరువర్గాల కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేసి అక్కడి నుంచి చెదరగొట్టారు.