పిల్లల ఇంటర్నెట్ వినియోగంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పిల్లలను నెట్ను వినియోగించొద్దని అనలేమని, అది ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు అని సుప్రీం ధర్మాసం స్పష్టం చేసింది. మోసాలు, ఆన్లైన్ వేధింపులు నుంచి పిల్లలను రక్షించాలన్న పేరుతో వారికి ఇంటర్నెట్ను నిరాకరించలేమని తేల్చి చెప్పింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 19(1)(a) కింద ఇంటర్నెట్ యాక్సెస్ అనేది అందరికీ వర్తిస్తుందని పేర్కొంది. పిల్లల ఇంటర్నెట్ వాడకాన్ని పూర్తిగా నిలిపివేయడానికి బదులుగా వారికి ఆన్లైన్ ప్రమాదాలను తగ్గించే భద్రతా చర్యలను అమలు చేయాలని కోర్టు సూచించింది.