భారత మహిళా క్రికెట్ స్టార్ జెమీమా రోడ్రిగ్స్ ను స్విట్జర్లాండ్ టూరిజం భారత్ కు ఫ్రెండ్షిప్ అంబాసిడర్ గా నియమించింది. స్విట్జర్లాండ్ పర్యాటక మార్కెట్లలో భారత్ టాప్ -10లో ఉందని సంస్థ తెలిపింది. ముఖ్యంగా శరదృతువు (ఆటమ్), శీతాకాలంలో భారత పర్యాటకుల సంఖ్యను పెంచడమే ఈ ప్రచారం లక్ష్యం. ఈ కొత్త బాధ్యతపై జెమీమా సంతోషం వ్యక్తం చేసింది. భారత్ కు ప్రాతినిధ్యం వహించడం తనకు ఎప్పుడూ ప్రత్యేకమని తెలిపింది.