విమానాల నిర్వహణ, మరమ్మతులు, సాంకేతిక సేవల రంగంలో ప్రముఖ సంస్థ జీఎంఆర్ ఏరో టెక్నిక్.. కెనడాకు చెందిన కార్పొరేషన్ లాజిక్ ఎయిర్ ఇంక్తో కీలక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దేశీయ, అంతర్జాతీయ విమానయాన మార్కెట్లలో విమానాల మార్పులు, ఇంజినీరింగ్, ధ్రువీకరణ, కాలం చెల్లిన పరికరాలు తదితర సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన అత్యాధునిక పరిష్కారాలను సంయుక్తంగా అందించేందుకు రెండు సంస్థలు నిర్ణయించాయి. ఈ భాగస్వామ్యంతో మధ్యప్రాచ్యం, ఆసియా-పసిఫిక్ ప్రాంతాల్లోని విపణి అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు వెల్లడించాయి.