సీఈసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో శుక్రవారం బెంగళూరులో తిరంగా మార్చ్ నిర్వహించారు. జాగృత కర్ణాటక, మై ఓట్ మై రైట్ సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. టౌన్హాల్ నుంచి ప్రారంభమైన మార్చ్.. కెంపేగౌడ రోడ్డులోని మైసూరు బ్యాంక్ సర్కిల్ సమీపంలో ఉన్న బన్నప్ప పార్కులోని క్విట్ ఇండియా స్మారకం వరకు సాగింది. నిరసనకారులు జాతీయ జెండాలను చేతబట్టి, రాజ్యాంగ పీఠికతో కూడిన బ్యానర్ను ప్రదర్శించారు.