అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ముంబయిలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్తో సమావేశం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. భారత విదేశాంగ మంత్రి సమావేశ వివరాలను అమెరికా రాయబారి సెర్గియో గోర్ ప్రకటించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘మిస్టర్ రూబియో తన ఉద్యోగిని ముంబయికి పిలిపించారు. విదేశాంగ శాఖలో ఏం జరుగుతోందో మీ అధికారులకే స్పష్టత లేదు. మోదీజీ, మీరు దీనిపై వివరణ ఇవ్వాలి. లేదంటే నేను చెప్పాల్సి వస్తుంది’ అంటూ వ్యాఖ్యానించారు.