సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్రైజర్స్ హైదరాబాద్ సహయజమాని కావ్య మారన్ వివాహం గురించి ఇంటర్నెట్లో చాలాకాలంగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి కానీ తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన అధికారిక సమాచారం బయటకు వచ్చింది. సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్, ఆయన సతీమణి తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి, నవంబర్ 21న జరగనున్న వివాహ రిసెప్షన్కు ఆహ్వానించారు. కళానిధి మారన్ కుమార్తె అయిన కావ్య మారన్, ఐపీఎల్ సమయంలో సోషల్ మీడియాలో ఎంతగానో ట్రెండ్ అవుతూ ఉంటారు.