తెలంగాణ యువత రాజకీయ ఆకాంక్షలు, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జనసేన పార్టీ ముందుకు సాగుతుందని ఆ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. తెలంగాణలో జనసేనకు ఒక్క అవకాశం ఇవ్వాలని పట్టభద్రులు, యువతను చేతులెత్తి విజ్ఞప్తి చేశారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావుకు మద్దతుగా రూపొందించిన ‘ జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్ ’ ప్రచార రథాన్ని పవన్ కళ్యాణ్ శుక్రవారం హైదరాబాద్లో ప్రారంభించారు.