చిత్తూరు జిల్లా పుంగనూరు నామినేషన్ సెంటర్ వద్ద కూడా టీడీపీ కార్యకర్తలు బీభత్సం సృష్టించారు. వాహనాలను ధ్వంసం చేసి తిరగబెట్టేశారు. నామినేషన్‌ను సెంటర్‌ను టీడీపీ కార్యకర్తలు చుట్టుముట్టేశారు. నామినేషన్ కార్యక్రమానికి వెళ్తుండగా టీడీపీ మూకలు రెచ్చిపోయాయి. టీడీపీ కార్యకర్తలు దాడిలో 10 వాహనాలు ధ్వంసమయ్యాయి. వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డిపై టీడీపీ కార్యకర్తలు హత్యాయత్నం చేశారు. కత్తులు, రాళ్లు, కర్రలతో మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై దాడి చేశారు. టీడీపీ కార్యకర్తలు దాడిలో మిథున్‌రెడ్డి గాయపడ్డారు. మిథున్‌రెడ్డి గన్‌మెన్ తలకు తీవ్రగాయమైంది. వైఎస్సార్సీపీ నేతలు కూడా గాయపడ్డారు.