వినూత్న ఆవిష్కరణలో కస్టమర్లను అబ్బుపరుస్తున్నాయి ఆటోమొబైల్ కంపెనీలు. ఇందులో ఒకటే ‘ఎగిరే కారు’. ఇప్పటికే పలు సంస్థలు వీటి తయారీపై దృష్టి పెట్టగా.. తాజాగా అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన ‘టెస్లా’ మరో అడుగు ముందుకేసింది. ‘ఫ్లయింగ్ టెస్లా’ కారును ఆవిష్కరించింది. తమ అధునాతన రోడ్లర్ మోడల్లో ఎగిరే కారును తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను మస్క్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. అటు టెస్లా కూడా కారు వీడియోను విడుదల చేసింది.