ఎఫ్.సి.ఐ అధికారిక గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశంలో ఆహార ధాన్యాల కొరత అసలు లేనేలేదు. రాబోయే మరో రెండేళ్లపాటు దేశ ప్రజల ఆహార అవసరాలను ఎలాంటి ఆటంకం లేకుండా తీర్చగల అత్యంత భారీ బఫర్ నిల్వలు గోదాముల్లో సిద్ధంగా ఉన్నాయి. వర్షపాతం తగ్గింది, దిగుబడులు పడిపోతాయంటూ మీడియా, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను ఆసరాగా చేసుకుని వ్యాపారులు, దళారీలు నిత్యావసర సరుకులను ఇష్టారాజ్యంగా బ్లాక్ చేస్తున్నారు. ఫలితంగా, బియ్యం నుంచి ఉప్పు, పప్పులు, నూనెలు, కూరగాయల వరకు ప్రతీ ఒక్క వస్తువు ధర ఆకాశాన్నంటుతోంది.