అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రంలో మంగళవారం ఘోర విమాన ప్రమాదం జరిగింది. విమానం కూలిపోవడంతో ఓ చిన్నారి సహా ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటన విస్కాన్సిన్ డెల్స్ సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి ఆరు సీట్లు, ఒకే ఇంజిన్ కలిగిన పైపర్ PA-46 రకం చిన్న విమానం కెనోషా నుంచి మెనోమోనీకి బయలుదేరింది. అయితే, స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 9:30 గంటల సమయంలో డెల్లోనా పట్టణానికి చెందిన అటవీ ప్రాంతంలో కూలిపోయింది.