కాఫీ పొడి ప్యాకెట్ల లోడు చాటున ఎర్ర చందనం తరలిస్తున్న 8 మంది అంతర్రాష్ట్ర స్మగ్లర్లను పోలీసులు పట్టుకున్నారు. కడప జిల్లా ఎస్.ఏ. కాశినాయన మండలం ఆకుల నారాయణపల్లె సమీపంలో ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తుండగా దాడులు చేసి పట్టుకున్నామన్నారు. తమిళనాడుకు చెందిన ఏడుగురు, ఏపీకి చెందిన ఒక్కరిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి 70 ఎర్రచందనం దుంగలు, మూడు వాహనాలు, 643 కాఫీ పౌడర్ అట్టపెట్టెలు సీజ్ చేసినట్లు వెల్లడించారు.